దిల్ రాజు అంటే హిట్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్. ఆయన్ని ఈ తరం రామానాయుడు అంటారు. దిల్ రాజు కొత్త కాంబినేషన్లు సెట్ చేయడం, ఉన్న వాటిని రిపీట్ చేయడంలో దిట్ట. ఆయన ఏడాదికి చిన్నా పెద్దా మూవీస్ కలుపుకుని మొత్తం ఆరేడు వరకూ సినిమాలు అలా తీస్తూనే ఉంటాడు. ఇక ఆయన తాజాగా బిగ్ ప్రాజెక్ట్ ఒకటి పట్టాడని తెలుస్తోంది.


ఇండియన్ బాహుబలి ప్రభాస్ తో మూవీ చేయడానికి మంచి కధతో అప్రచ్ అయ్యాడని తెలుస్తోంది. ఈ కధ విన్న వెంటనే ప్రభాస్ ఒకే అనేశాడట. ప్రొసీడ్ అంటూ  దిల్ రాజుతో చెప్పేసాడట. మరి ఇప్పటికే సాహో మూవీతో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లతో అదరగొడుతున్న ప్రభాస్ ఇపుడు ఇంటర్నేషనల్ ఇమేజ్ కలిగిన స్టార్ అయిపోయాడు.


సాహో తరువాత తన సొంత బ్యానర్ మీద జాన్  అనే టైటిల్ తో మూవీని చేస్తున్నాడు. ఆ మూవీ తరువాత దిల్ రాజు మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదివరకు ప్రభాస్ దిల్ రాజు కాంబోలో మున్నా, మిష్టర్ పర్ఫెక్ట్ మూవీస్ వచ్చాయి. ముచ్చటగా మూడవదిగా రాబోతున్న ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వబోతోందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: