ప్రభాస్ బాహుబలి రికార్డు ఇప్పటి వరకు పదిలంగానే ఉన్నది.  బాహుబలి రికార్డ్ బ్రేక్ కావాలంటే.. మరలా రాజమౌళి రావాల్సిందే అనే టాక్ ఉన్నది.  కానీ, ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసేలా ఉందని సమాచారం వినిపిస్తోంది.  ప్రీ రిలీజ్ విషయంలో ఇప్పటికే అందరి అంచనాలను మించుతూ దూసుకుపోతున్నది.  


ఇప్పటికే ఈ సినిమా 255 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. దీనిపై అంచనాలు అలాగే ఉన్నాయి.  రిలీజ్ తరువాత మూవీ భారీ వసూళ్లు సాధించడం ఖాయమని, బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తుందని అంటున్నారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా అది నిజమయ్యేలా ఉన్నట్టు చెప్తోంది.  


ఇదిలా ఉంటె, ప్రభాస్ సినిమా రిలీజైన రెండు నెలకు మెగాస్టార్ చిరంజీవి సైరా రిలీజ్ కాబోతున్నది.  చారిత్రాత్మక సినిమా కావడంతో దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా కోసం మెగాస్టార్ రెండేళ్లుగా కష్టపడుతున్నారు.  దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  


ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది.  ప్రస్తుతం మెగాస్టార్ డబ్బింగ్ చెప్తున్నారు.  మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్ అందుకున్నాయి.  ఆగష్టు 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది.  ట్రైలర్ తరువాత సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలౌతుంది.  ప్రభాస్ సాహో, బాహుబలి రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: