సినిమా ఫీల్డ్ లో విలన్ అవుదామని వచ్చి హీరోలు అయిన వాళ్ళున్నారు.  హీరోలు అవుదామని వచ్చి హీరోలు అయిన వాళ్ళున్నారు. అక్కడ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. నేను హీరో నే అవుతానని భీష్మించుకుని కూర్చుంటే నడవదు. దర్శక నిర్మాతలు ఏ పాత్ర కి తీసుకుంటారో చెప్పలేం.  కమెడియన్ ప్రియదర్శి జీవితంలో కూడా అలానే జరిగింది.

 

తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో ప్రియదర్శి ఒకరు. తొలి సినిమా " పెళ్ళి చూపులు " సినిమా  ద్వారా  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌశిక్ పాత్ర ద్వారా జనాలకి చేరువ కాగలిగాడు. ఆ సినిమాలో ప్రియదర్శి చెప్పే డైలాగులకి జనం విరగబడి నవ్వుకున్నారు. ఆ సినిమా తర్వాత నుండి అతనికి కమెడియన్ అవకాశాలు రావడం మొదలయ్యాయి.  ఒక మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

అయితే ప్రియదర్శి కమెడియన్ అవుదామని రాలేదంట. అతనికి విలన్ పాత్రలు వేయడం బాగా ఇష్టమంట. పెద్ద విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడట. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ స్థాయి విలన్ అవ్వాలని అనుకున్నాడట.  తనకి విలనిజం అంటే ఇష్టమని, అటువంటి పాత్రల్లో చేయడం ఆసక్తిగా ఉంటుందని తాజాగా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

 

ఈ కారణంగానే 'టెర్రర్' .. 'బొమ్మల రామారం' సినిమాల్లో విలన్ గా నటించాను. ఆ సినిమాలు అంతగా గుర్తింపు తీసుకురాలేదు .. ఆ తరువాత అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా 'పెళ్లి చూపులు' సినిమాలో అవకాశం వచ్చింది. ఏదో ఒకటిలే .. ముందు ఫుడ్డు దొరుకుతుందని చేశాను. ఆ పాత్రే నా కెరియర్ ను మలుపు తిప్పింది. నన్ను కమెడియన్ ను చేసి ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది" అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: