ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ పేరుతో వెబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఛానల్ లో ఈమధ్య తమ్మారెడ్డి పవన్ ఓటమి గురించి కారణాలు విశ్లేషిస్తూ చేసిన కామెంట్స్ పై పవన్ అభిమానుల నుండి విపరీతమైన విమర్శలు రావడమే కాకుండా తమ్మారెడ్డి పై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ జరిగింది.

ఇప్పుడు తన పై జరిగిన మాటల దాడిపై తమ్మారెడ్డి చాల ఘాటుగా స్పందించాడు. తాను నడుపుతున్న వెబ్ ఛానల్ పేరు ‘నా ఆలోచన’ అని పేర్కొంటూ పవన్ ఎందుకు ఓడిపోయాడు అన్న తన అభిప్రాయాన్ని తాను వివరించానని అయితే మరి ఏ ఇతర కారణాలతో పవన్ ఓడిపోయాడో చెప్పకుండా తన పై అసభ్యపదాలు వాడితే ప్రయోజనం ఏమిటి అంటూ పవన్ అభిమానులకు తమ్మారెడ్డి ప్రశ్నించాడు. 

అంతేకాదు సభ్యత లేకుండా ఎదుటి వ్యక్తి పై అసభ్య పదజాలంతో మాటలదాడి చేస్తే దానివల్ల వచ్చే నెగిటివిటితో చివరకు నష్టపోయేది పవన్ మాత్రమే అంటూ అభిమానులకు హెచ్చరికలు ఇస్తున్నాడు తమ్మారెడ్డి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని అయినా విమర్శించవచ్చు అన్న ప్రాధమిక విషయం పవన్ అభిమానులకు తెలియదా అంటూ తమ్మారెడ్డి పవన్ వీరాభిమానులను కార్నర్ చేస్తున్నాడు. 

వాస్తవానికి ఈ వ్యవహారం అంతా తమ్మారెడ్డి పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధమే అయినా పవన్ తన అభిమానుల అత్యుత్సాహంతో పరోక్షంగా నష్టపోతున్నాడు అని వస్తున్న కామెంట్స్ కు తమ్మారెడ్డి మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి. లక్షల సంఖ్యలో వీరాభిమానులు ఉండి కూడ కనీసం తాను పోటీ చేసిన ఒక స్థానంలో కూడ పవన్ ఎందుకు గెలవలేకపోయాడు అన్న విషయమై లోతుగా పవన్ అభిమానులు కూడ వాస్తవాలు గ్రహించి ఆలోచించవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: