తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు ఎక్కువగా ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి రాజకీయాల్లో ఉంటున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు.  దీనితో పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయ అడుగులు ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

పవన్ కళ్యణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో కి మళ్ళీ వస్తాడు అని రూమర్లు జోరందుకుంతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ దీనిపై ఇంతవరకు స్పందించలేదు.

అది గాక  పవన్ కళ్యాణ్ పాతికేళ్ళపాటు రాజకీయాల్లోనే కొనసాగుతానని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా మొన్నటి వరకు  పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతోనే కనిపించాడు.

 

తాజాగా పవన్ కళ్యాణ్ గడ్డం ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఓ చిన్నారిని కలసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రిమ్ చేసిన తర్వాత పవన్ లుక్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. కలర్ ఫుల్ డ్రెస్ తో, పక్కనే ఓ చిన్నారి కూడా ఉండడం నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఈ సరికొత్త లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు సందడి చేసుకుంటున్నారు.

 

పవన్ కళ్యాణ్ తర్వాత ఇండస్ట్రీ లో మొదటి స్థానం ఎవరంటే చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్థానం ఇప్పటికీ అలాగే ఉంది.మరి రాజకీయంలో ఉంటూనే ఆయన సినిమాలు చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆయన తీసుకోబోయే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: