బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు హీరోయిన్ కష్టాలు ఏర్పడ్డాయి అంటూ వచ్చిన్న వార్తలు యదార్ధం. అయితే ఏకంగా బాలకృష్ణకు హీరోయిన్ గా ఈమధ్యనే శ్రీమంతం జరుపుకున్న సమీరారెడ్డి ఎంపిక కాబోతోంది అంటూ వచ్చిన వార్తలను చూసిన వారు చాలామంది ఆశ్చర్యపడుతూ బాలయ్య హీరోయిన్స్ కష్టాలు ఈ రేంజ్ కి దిగజారి పోయాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

వాస్తవానికి సమీరా రెడ్డికి తెలుగు సినిమాలలో మళ్ళీ నటించాలి అన్న కోరిక ఉన్నా ప్రస్తుతం నెలలు నిండి డెలివరీకి దగ్గరలో ఉన్న సమీరా బాలయ్యకు హీరోయిన్ ఏమిటి అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి మొదట్లో పాయల్ రాజ్ పుట్ మెహేరిన్ లు హీరోయిన్స్ గా అనుకున్నా ఈసినిమా ప్రారంభం ఆలస్యం కావడంతో ఈ ఇద్దరి హీరోయిన్స్ డేట్స్ వేరే నిర్మాతలకు వెళ్ళిపోయాయి. 

దీనితో దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తమన్నాతో చర్చలు జరుపుతున్నా ఆమె ఇంకా ఎటూ తేల్చక పోవడంతో రంగంలోకి శ్రియను తీసుకు వచ్చారు. అయితే ఇప్పటికే శ్రియ బాలకృష్ణతో మూడు సార్లు నటించిన నేపధ్యంలో మూవీకి క్రేజ్ ఉండదని బాలయ్య పక్కన తమన్నాను ఒప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇలాంటి పాట్లను పరిశీలించిన కొందరు బాలయ్యకు ఇప్పుడు ఏర్పడ్డ హీరోయిన్ కష్టాలు తీరాలి అంటే ఒక్క సమీరా రెడ్డి మాత్రమే తీర్చగలదు అంటూ వేసిన సెటైర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ తో తీవ్ర నిరాశలో ఉన్న బాలకృష్ణకు ఇప్పుడు తన సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ అంటూ వస్తున్న కథనాలను చూసి షాక్ అవ్వడమే కాకుండా తీవ్ర మనస్తాపానికి గురియ్యే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: