టాలీవుడ్ లో తన కామెడీతో ట్రెండ్ సృష్టించి అతి తక్కువ కాలంలో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్న కమెడియన్ సంపూర్ణేష్ బాబు.  ‘హృదయకాలేయం’సినిమా రిలీజ్ కి ముందు నుంచే సోషల్ మాద్యమాల ద్వారా సంచలనం సృష్టించి రిలీజ్ అయ్యాక తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సంపూర్ణేష్ బాబు.  వాస్తవానికి ఈ సినిమా పెద్దగా అలరించక పోయినా...ఇందులో పంచ్ డైలాగ్స్, విచిత్రమైన కామెడీ..సంపూ ఓవర్ యాక్షన్ అన్ని కలిసొచ్చాయి. 

ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ వస్తున్నాడు సంపూ.  తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 లో రెండు వారాల తర్వాత తాను ఉండలేనని..ఏడ్చి బిగ్ బాస్ ని తిట్టి నానా రబస చేసి వార్తల్లోకి ఎక్కారు సంపూర్ణేష్ బాబు.  ఇక సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘కొబ్బరిమట్ట’.  ఈ మూవీ మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది.  ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి.  ‘కొబ్బరిమట్ట’ రిలీజ్ డేట్ ఇప్పుడూ..అప్పుడూ అనుకుంటూ సాగదీస్తూనే ఉన్నారు.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సంపూర్ణేశ్ బాబు వున్నాడు. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం సంపూకి ఎంత వరకు కలిసి వస్తుందో..హిట్ అయితే మళ్లీ ఎంద వరకు బిజీ అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: