ఇండియన్ ఫిలిం క్రేజియస్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న’RRR’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. చెర్రీ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియా భట్ కన్ఫామ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన మాత్రం ఇంకా ఎవరో తెలియడం లేదు.


ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోవడానికి అప్పట్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. తాజాగా ఈ ప్రయత్నంలో భాగంగా రాజమౌళి బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే జాన్వీ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి లేదట. దీంతో ఆమె ప్రాజెక్ట్ ని రిజెక్ట్  చేసిందని టాక్.


సినిమాలో ఆమె పాత్ర కంటే అలియా భట్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో జాన్వీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. గతంలో జాన్వీ తల్లి దివంగత శ్రీదేవి కూడా రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. నిజానికి 'బాహుబలి'లో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవి ని అనుకున్నారు. కానీ ఆమె రెమ్యునరేషన్ అధికంగా అడగడంతో రాజమౌళి ఆ పాత్రకి రమ్యకృష్ణ ని తీసుకొని సినిమాకే హైలెట్ చేయించారు. మొత్తం మీద ఏది ఏమైనా రాజమౌళి సినిమా ఆఫర్ ని సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పక్కన పెట్టడం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: