‘సైరా’ లో ప్రత్యేక పాత్రను చేస్తున్న అనుష్కను ఆపాత్ర కోసం ఒప్పించడానికి రామ్ చరణ చాల కష్టపడవలసి వచ్చింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు తాము ఏరికోరి తెచ్చుకున్న అనుష్క వల్ల సైరా’ టీమ్ కు అనుకోని సమస్యలు ఎదురౌతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే అనుష్కకు కూడ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న గాయాల సమస్య ఎదురైనట్లు సమాచారం. ఇప్పటికే గాయాలతో సతమవుతూ తాము నటిస్తున్న సినిమాలకు సమస్యగా మారిన రామ్ చరణ్ ఎన్టీఆర్ నాగశౌర్య సందీప్ కిషన్ శర్వానంద్ లిస్టులో అనుష్క కూడ చేరింది అని టాక్. అయితే ఈవిషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. 

అనుష్క నటిస్తున్న ‘సైలెన్స్’ మూవీ షూటింగ్ లో ఆమె కాలికి గాయం అయింది అనీ అయితే ఆ సంఘటన అమెరికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు జరగడంతో బయటకు రాలేదని అంటున్నారు. అయితే ఆమె కాలిగాయం తగ్గిపోయినా ఇంకా నొప్పి ఆమెను వెంటాడుతోందనీ దీనితో ఆ నొప్పిని ఆమె లెక్కచేయకుండా ‘సైరా’ షూటింగ్ కు వచ్చినప్పుడు అసలు విషయం బయటకు వచ్చిందని తెలుస్తోంది. 

అయితే అనుష్క ఈ నొప్పి వల్ల ‘సైరా’ షూటింగ్ లో తన పాత్ర షూటింగ్ ను పూర్తిచేయలేక పోవడంతో ఇంకా ఆమె షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఆమె ‘సైలెన్స్’ సినిమా కోసం తన బరువును తగ్గించుకున్నా తిరిగి ఆమె ‘సైరా’ షూటింగ్ లో ఆమె కనిపించినప్పుడు మళ్ళీ లావు అయినట్లు కనిపించడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించినట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: