ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఓ బేబీకి సంబంధించిన పోస్టింగులు కనిపిస్తున్నాయి. ఓ బేబీ ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. ఈ సినిమా అంతా సమంత భుజస్కందాలపై నడుస్తుంది. ఆమె చాలా బాధ్యతగా ఈ సినిమాను డీల్ చేసింది. నటనలో అంతకు మించి అనేలా నటించి మెప్పించింది సమంత.
సమంత నటన గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఓ బేబీ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషన్ కు లోనయ్యాను. ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మలా నటించి అనే కంటే.. 70 ఏళ్ళు అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. సినిమా మొత్తాన్ని సమంత తన భుజస్కందాలపై మోసింది అని చెప్తూ ట్వీట్ చేశారు.
రాఘవేంద్ర రావు వంటి గొప్ప డైరెక్టర్ ఇలా ట్వీట్ చేయడంతో అందరు షాక్ అయ్యారు. సమంత తెగ ఎంజాయ్ చేస్తున్నది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ రాకపోయినా..ఆయన తన సినిమాను మెచ్చుకోవడం విశేషం. ఇది సమంత సినిమాకు తప్పకుండా ఒక మైలేజ్ గా ఉపయోగపడుతుంది.
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు అన్నది నిజం. జులై 5 వ తేదీన థియేటర్లో సందడి చేయబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాకు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.