తమన్నా తళుకుబెళుకుల తార. మిల్కీ బేబీ. ఆమె గ్లామర్ ఎక్కడా చెక్కుచెదరలేదని సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 మూవీ తేల్చి చెప్పింది. తమ్మూ అందులో తెగ రెచ్చిపోయి నటించింది. ఇక అభినేత్రి 2 మూవీ ఫెయిల్ అయినా తమ్మూ తన నటనతో అదరగొట్టింది. పదేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి సీనియర్ అంటున్నారు కానీ తమన్నాకు అందం, నటన రెండూ ఉన్నాయి. ఇప్పటికీ యంగ్ హీరోల పక్కన నటించే సత్తా ఉంది. డ్యాన్సుల్లో అదరగొట్టే తమ్మూ వెంకటేష్ పక్కన జంటగా నటించడంతో సీనియర్ల కన్ను ఆమె మీద పడింది.


లేటెస్ట్ గా ఓ సీనియర్ హీరో మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని తెగ ట్రై చేస్తున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సీనియర్ హీరోకు ఎక్కడ చూసినా హీరోయిన్లు దొరకడం లేదు. దాంతో ఆయన భారీ వేటలో పడ్డారట. తమన్నా అయితే బాగుంటుందని, ఫ్రెష్ లుక్ వస్తుందని ఆలోచించారట. దీంతో ఆ చిత్ర యూనిట్ తమన్నాతో సంప్రదింపులు జరిపారట. అయితే ఆ సీనియర్ హీరో పక్కన చేయడానికి తమన్నా ఇంటెరెస్ట్ చూపించలేదని టాక్.


తనకు ఇంకా వయసు ఉందని, అవకాశం వస్తే సత్తా చాటగలనని భావిస్తున్న తమన్నా ఇపుడు సీనియర్ల పక్కన నటిస్తే ఇంక తన చాప్టర్ క్లోజ్ అని భావిస్తోందంట. అందువల్లనే ఆ సీనియర్ హీరోకు నో చెప్పిందని అంటున్నారు. చిత్రమేంటంటే గతంలోనూ తమన్నాను ఆ హీరో అడిగారు. అయితే అపుడు కూడా నో చెప్పిన తమన్నా ఇప్పటికీ అదే పట్టు మీద ఉండడం గమనార్హం. మొత్తానికి తమన్నాతో జట్టు కట్టాలని తెగ ముచ్చట పడుతున్న సీనియర్ హీరో గారి కల అలాగే ఉండిపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: