దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వారసుడు ప్రకాష్ కోవెలమూడి ప్రయోగాల మైండ్ సెట్ గురించి తెలిసిందే. ఇదివరకూ అనగనగా ఒక ధీరుడు.. సైజ్ జీరో లాంటి ప్రయోగాలు చేశారాయన. ఆ ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఈసారి బాలీవుడ్ లో అలాంటి ప్రయత్నమే చేస్తున్న సంగతి తెలిసిందే. కంగన రనౌత్ - రాజ్ కుమార్ రావ్ జంటగా `మెంటల్ హై క్యా` అనే ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కిస్తున్నారు.

 

ఈ సినిమా పోస్టర్లు సహా ప్రతిదీ ఆసక్తి పెంచాయి. మనిషిలో మెంటర్ డిజార్డర్స్ నేపథ్యంలో ప్రయోగాత్మక స్క్రిప్టును ఎంచుకుని ప్రకాష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలోనూ పెద్ద సక్సెసయ్యారు. మెంటల్ అన్న టైటిల్ కి తగ్గట్టే పోస్టర్లు మంట పుట్టించాయి. అయితే ట్రైలర్ రిలీజ్ ముందు `మనోభావాలు` పేరుతో వివాదం రాజుకుంది.

 

మెంటల్ డిజార్డర్స్ పేరుతో అమానవీయతను తెరపై చూపిస్తారా? అంటూ కోర్టులో కేసు వేసి పిటీషనర్లు వాదిస్తున్నారు. మానసిక రుగ్మతలు ఉన్న పేషెంట్ మనోభావాల్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అభ్యంతరం వ్యక్తమైంది. రిలీజ్ కి ముందు ట్రైలర్ ప్రివ్యూని చూపించాల్సిందిగా సైక్రియాటిస్టు సంఘం(ఐపీఎస్) గుజరాత్ హైకోర్టులో పిటీషన్ వేసింది.

 

జూన్ 11న సీబీఎఫ్ సీ ప్యానెల్ కి ట్రైలర్ ని సబ్ మిట్ చేశారు. ఆ క్రమంలోనే సీబీఎఫ్ సీ ట్రైలర్ రివ్యూకి ఐపీఎస్ బృందం సిద్ధమైంది. పిటీషనర్ సమక్షంలో రివ్యూ చేయనున్నారని సెన్సార్ బోర్డ్ తరపున న్యాయవాది క్షితిజ్ అమిన్ తెలిపారు. ట్రైలర్ రివ్యూ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటారని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై తుది విచారణ వచ్చే వారం జరగనుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: