సైరా కోసం మెగాస్టార్ డబ్బింగ్ స్టార్ట్ చేసి స్పీడ్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.  ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నా.. మెగాస్టార్ ను ఓ విషయం మాత్రం కలవరపెడుతున్నది.  అదే విజువల్ ఎఫెక్ట్స్.  విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో బాహుబలికి మించేలా ఉండలని అందరు కోరుకుంటున్నారు. 

 

ఏ మాత్రం తేడా వచ్చినా సినిమాకు మైనస్ అవుతుంది.  అందుకే సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని మెగాస్టార్ టీమ్ కు అల్టిమేటం జారీ చేశారు.  దీనికోసం దాదాపు 10 కంపెనీలు వర్క్ చేస్తున్నాయి.  ఎలాగైనా బెస్ట్ ఇవ్వాలని కృషి చేస్తున్నాయి.  సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ముఖ్యం కాబట్టి సినిమాను ఎలాగైనా బెస్ట్ మూవీగా నిలబెట్టాలని అన్నది చిరు లక్ష్యం. 

 

అటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు.  అనుకున్నట్టుగా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ అవుతుందని, అనుకున్నట్టుగా బెస్ట్ ఎఫెక్ట్స్ వస్తాయని.. భయపడాల్సిన అవసరం లేదని దర్శకుడు అంటున్నాడు.  ఎంతలేటైనా పర్వాలేదు మెగాస్టార్ కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలవాలన్నది రామ్ చరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 

దాదాపు 200 కోట్ల రూపాయలకు పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.  ఆగష్టు 22 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాబోతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: