అక్కినేని సమంత మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఓ బేబీ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ తరువాత కూడా అదే విధమైన వైబ్ ను క్రియేట్ చేసుకుంది.  ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ట్రైలర్ కట్ చేసిన విధానం సూపర్బ్ గా ఉంది. 

 

ట్రైలర్ ను సీరియస్ గా ఓపెన్ చేశారు.  బామ్మ వయసున్న లక్ష్మి బేబీ గా ఫోటో స్టూడియోకు వస్తుంది.  ఫోటోగ్రాఫర్ గా రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడు.  అంతలో మెరుపు.. 70 ఏళ్ల బామ్మ.. ఒక్కసారిగా 24 సంవత్సరాల వయసుకలిగిన యువతిగా మారిపోతుంది.  యువతిగా ఉన్నప్పుడు చేయలేని ఎంజాయ్ ను సమంత తిరిగి తన వయసును వెనక్కి తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంది. 

 

బేబీకి ఆ వయసు తిరిగి ఎలా వెనక్కి వచ్చింది అన్నది సస్పెన్స్.  ఫన్నీతో పాటు సినిమాలో అనేక విషయాలను పొందుపరిచారు.  సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.  నాగశౌర్యతో కలిసి మందుకొట్టే సమయంలో సమంత చెప్పిన డైలాగులు అదుర్స్ అనిపించాయి.  పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలో చెప్పిన విధానం బాగుంది. 

 

చేసుకునేవాడు పాకెట్ లో ఎప్పుడు డబ్బులు ఉండాలి.. ఏది కావాలంటే అది కొనిపెట్టేవిధంగా ఉండాలి.. మంచం ఎక్కితే మగాడిలా ఉండాలి అని చెప్పిన డైలాగులు సూపర్బ్ గా ఉన్నాయి.  ఈ డైలాగులు థియేటర్లో నవ్వులు పూయించడం గ్యారెంటీ.  నవ్వులు తరువాత సంగతి.. పాపం నాగచైతన్య పరిస్థితి ఏంటి అన్నది తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: