ప్రస్తుతం సీనీ నటులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో చాలా  మంది హీరో, హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటను ఎంచుకున్నారు  ప్రముఖ నటి నవనీత్ కౌర్. నవనీత్ కౌర్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  తెలుగులో శీను వాసంతి లక్ష్మీ, మహారథి లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు నవనీతకౌర్. ప్రస్తుతం ఆమె పార్లమెంటరీయన్‌గా మారిపోయారు.

 

మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఐదుసార్లు ఎంపీగా పని చేసిన సీనియర్ నాయకుడిని ఓడించి మరీ విజకేతనం ఎగురవేసింది అమ్మడు.  నవనీత్ కౌర్ ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో శివసేన సీనియర్ నేత ఆనందరావు విఠోబాను ఓడించారు. 2014 ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నుంచి పోటీ చేసిన ఆమె ఆ ఓడిపోయారు. ఈ ఎన్నికల్ మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీని చేసి విజయం సాధించారు.

 

బాబా రాందేవ్‌ను ఫాలో అయ్యే నవనీత్ కౌర్‌కు యోగా క్యాంపులో రాజకీయ నాయకుడైన రవి రాణాతో పరిచయం ఏర్పడింది. తర్వాత 2011లో బాబా రాందేవ్ సమక్షంలోనే వాళ్లిద్దరూ పెళ్లాడారు. అలా ఆమెకు రాజకీయాలతో అనుబంధం ఏర్పడింది. ఆమె భర్త రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించడం గమనార్హం. ఈ సెగ్మెంట్ అమరావతి లోకసభ పరిధిలోకి రావడం నవనీత్ కౌర్‌కు కలిసొచ్చింది.

 

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు రవి రాణా మంచి స్నేహితుడు. దీంతో బీజేపీ తరఫునే పోటీ చేసే వీలున్నప్పటికీ.. శివసేనతో పొత్తు కారణంగా అది వీలుపడలేదు.  మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాతో.. ఎన్సీపీ నుంచి పోటీ చేయడం మంచిది కాదనే భావనతో నవనీత్ కౌర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అంతకు ఏడాది ముందు నుంచే జనం మధ్యన ఉండి వారితో మమేకమయ్యారు నవనీత్ కౌర్. మొత్తంగా పొలిటీషియన్‌ను పెళ్లి చేసుకొని.. హీరోయిన్ కూడా పొలిటీషియన్ గా మారిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: