ఆగస్ట్ 15  ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చేస్తున్నారు ప్రపంచ ప్రేక్షక జనం. బాహుబలి నెక్స్ట్ ప్రాజెక్ట్ కనుక, ఫ్యాన్స్ అని, వారని వీరని తేడా లేకుండా అందరిలోనూ ఒకరకమైన ఎగ్జైట్ మెంట్ రేపుతోందీ సాహో. ఇటీవలే వచ్సిన టీజర్ అంచనాలను ఆకాశం నుంచి అంతరిక్షం లెవెల్ కు తీసుకెళ్ళిపోయింది.

 

ఇప్పుడు ఇందులో ఆర్టిస్టులు ఒక్కొక్కరు తమ పాత్రల స్వభావాల గురించి ఓపెన్ అవుతూ హైప్ ని ఇంకా పెంచే ప్రయత్నంలో ఉన్నారు. అందులో చుంకీ పాండే ఒకరు. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ లో ఒకప్పుడు పేరుమోసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎక్కువగా హీరో పక్కన వేషాల్లో కనిపిస్తూ పాపులారిటీ తెచ్చుకున్న చుంకీ పాండే ఆ తర్వాత కాస్త వయసయ్యాక విలన్ గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

 

ఇప్పుడు సాహోలో కెరీర్ లోనే దుర్మార్గమైన విలన్ గా నటించాను అంటున్న చుంకీ పాండే ఏ రేంజ్ లో వయొలెన్స్ చేసుంటాడా అనే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. నిజానికి సాహోలో చాలా విలన్స్ ఉన్నారు. జాకీ శ్రోఫ్-మహేష్ మంజ్రేకర్-నీల్ నితీష్ ఇలా బాలీవుడ్ అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్ మొత్తం ఇందులో ప్రతినాయక పాత్రలు వేసింది.

 

మందిరా బేడి సైతం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. మరి ఇంత పెద్ద గుంపులో చుంకీ పాండే తనదైన విలనీ చేశాను అని చెబుతుంటే అదేంటో చూడాలంటె మాత్రం ఇంకో నెలలు వెయిట్ చేయక తప్పదు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సాహో రికార్డుల ఊచకోత మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: