మంచు విష్ణు నటించిన 'ఓటర్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర దర్శకుడు జి కార్తీక్ కు మరియు హీరోకు వివాదం ఏర్పడిన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదల ఆపేయాలంటూ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే సినిమా విడుదలను ఆపలేం అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చిత్రం పంపిణీ హక్కులను ప్రశాంత్ గౌడ్ కొనుగోలు చేయడం జరిగింది.

 

'ఓటర్' చిత్రం విడుదల సందర్బంగా ప్రశాంత్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ చిత్రంను లీగల్ గా కొనుగోలు చేశాను. నిర్మాత నుండి నాకు లీగల్ గా సినిమా దక్కింది. ఇందుకు సంబంధించిన అన్ని లీగల్ విషయాలు క్లీయర్ గా ఉన్నాయి. ఇక నాకున్న బ్యాక్ గ్రౌండ్ తో ఈ చిత్రాన్ని 370 థియేటర్లలో విడుదల చేయబోతున్నాను.

 

ఈ సినిమాను విడుదల చేయవద్దని కొందరు నన్ను బెదిరిస్తున్నారు. సినిమా విడుదల చేస్తే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని నన్ను కొందరు హెచ్చరించారు. నేను బెదిరింపులకు భయపడను. నేను ఇండస్ట్రీకి కొత్తవాడిని ఏమీ కాదు. ఇప్పటి వరకు నేను 42 సినిమాలు పంపిణీ చేయడంతో పాటు ఏడు సినిమాలు నిర్మించాను. నాకు జాతీయ స్థాయిలో నిర్మాతగా సర్కిల్ ఉంది.

 

నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో సినిమాను కొనుగోలు చేశాను. ఎవరు కూడా నన్ను అడ్డుకోలేరు అంటూ సవాల్ చేశాడు. ఓటర్ చిత్రం ఒక మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిందని అందుకే నాకు నచ్చి సినిమాను కొనుగోలు చేశాను అంటూ ప్రశాంత్ గౌడ్ అన్నాడు. సినిమా తీసుకున్నప్పటి నుండి నన్ను వేదిస్తున్నారు. ఎన్ని వేదింపులు వచ్చినా కూడా ధైర్యంగా సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: