ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది , ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చింది కట్ చేస్తే ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్దమయ్యింది . ఇంతకీ మూడు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశపడుతోంది ఎవరో తెలుసా …….. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ . 


నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను , మూడో పెళ్లి చేసుకుంటాను నాకు నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వండి అని అడిగిందట దాంతో చిర్రెత్తుకొచ్చింది హృతిక్ రోషన్ కు ఇంకేముంది ఇంట్లో బంధించి తగిన బుద్ది చెప్పాడట సోదరికి . 


హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ పెళ్లి చేసుకోవడం కొంతకాలం కాపురం చేసాక వాళ్లకు విడాకులు ఇవ్వడం కామన్ అయిపొయింది . దాంతో కుటుంబ పరువు పోయిందని బాధపడుతున్నారట . దానికి తోడు మధ్యలో కొన్ని ఎఫైర్ లు కూడా ఉండటంతో సోదరి అంటే చిరాకు పడుతున్నాడట హృతిక్ . అయితే ఆమెకు ఆమెగా మారాలి తప్ప రూమ్ లో ఎన్ని రోజులని బంధిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: