రాఘవ లారెన్స్ డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాక ముని సిరీస్ ని కంటిన్యూ చేస్తూ కాంచన, గంగ, కాంచన-2...ఇలా వరుసగా తీసి కమర్షియల్ సక్సస్ ని సొంతం చేసుకుంటున్నాడు. అదే దారిలో ఓంకార్ కూడా సక్సస్ అవ్వాలని చూస్తు ట్రై చేస్తున్నాడు. రాజుగారి గది సినిమాని తీసి హిట్ కొట్టిన ఓంకార్ ఆ తర్వాత రాజు గారి గది-2 తీసి కూడా కమర్షియల్‌గా సక్సస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అక్కినేని సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇక తన ప్రతీ సినిమాలో తమ్ముడికి ఒక ముఖ్య పాత్ర ఇవ్వడం కూడా అందరికి తెలిసిందే.

ఇందులో భాగంగానే ఓంకార్ ఇప్పుడు రాజుగారి గది-3 తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో తమన్న హీరోయిన్‌గా నటిస్తుందని లేటెస్ట్ న్యూస్. అంతేకాదు ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించబోతున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాను ఓంకార్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కథ మొత్తం తమన్న చుట్టూనే తిరుగుతుందని మరో లేటెస్ట్ అప్‌డేట్.


ప్రస్తుతం తమన్న సైరాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ లోనూ నటిస్తోంది. ఇక రీసెంట్‌గా తమన్న, ప్రభుదేవ కాంబినేషన్‌లో వచ్చిన అభినేత్రి-2 ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇదే జంట బాలీవుడ్‌లో నటించిన సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు ఓంకార్ సినిమా అయినా తమన్నాకి హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: