టీవీ కార్యక్రమాలు, సినిమాల విషయంలో కాంట్రవర్సీ క్రియోట్ చేయడంలో, కోర్టులకు ఎక్కడంతో తమిళనాడు వాళ్లు ముందుంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే..దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ పెద్ద హీరోల సినిమాలు ఏవి వస్తున్నా వాటిపై కోర్టులో పిటిషన్లు పడకుండా ఉండటం చాలా అరుదనే చెప్పాలి. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని అభ్యంతరాలు చెబుతూ సదరు హీరోలను న్యాయస్థానాల ద్వారా ముప్పుతిప్పలు పెడుతున్న విషయాలను చాలానే చూశాము. 
 
ప్రచార ఆర్భాటాల కోసం కొందరు, అర్థంలేని అభ్యంతరాలతో మరి కొందరు రచ్చ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమిళ బిగ్ బాస్ మీద కూడా అలాంటి పిటిషనే దాఖలు అయ్యింది. కమల్ హాసన్ హోస్టుగా రాబోతున్న ఈ కార్యక్రమం ఈసారి కూడా అక్కడ మూడో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ కు కూడా కమల్ హాసనే హోస్టుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రోగ్రామ్ పై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. 


ఆ కార్యక్రమం తీరు సరిగాలేదని, అందులో పాల్గొనేవారు పొట్టి దుస్తుల్లో ఉంటారని, ఓవర్ ఎక్స్ఫోజింగ్ చేస్తారని, మరీ శృతిమించిన పనులు చేస్తుంటారని వారు వ్యవహరించే తీరు పిల్లలను తప్పుదోవ పట్టించేలా ఉందని.. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. థర్డ్ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఈ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై న్యాయస్థానం ఏమంటుందో! అయితే ఇలాంటివి బిగ్ బాస్ కి కొత్తేమి కాదని ప్రతి భాషలోను ఇలాంటివి సహజం అయిపోయాయని కొందరు లైట్ తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: