గరుడవేగ సినిమా ముందువరకు రాజశేఖర్ పరిస్థితి అసలు బాగాలేదనే చెప్పాలి. ఆ సినిమా కు ముందు చాలాకాలం ఈ హీరోకి సరైన హిట్టే లేదు. గరుడవేగ రాజశేఖర్ కు కొత్త కెరీర్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే గరుడవేగ ముందు.. ఆ సినిమా తర్వాత అన్నట్టు మారింది రాజశేఖర్ మార్కెట్. ఆ సినిమా ప్రభావం ఈ హీరో కెరీర్ పై క్లియర్‌గా తెలుస్తోంది. రాజశేఖర్ సొంతగా రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి సహాయపడ్డమే కాకుండా... కల్కి బిజినెస్ విషయంలో కూడా గరుడవేగ బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.


కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ ఇంతకముందే హోల్ సేల్ గా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శాటిలైట్, డిజిటల్ డీల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. గరుడవేగ సినిమా విడుదలై, హిట్ అనిపించుకున్న తర్వాతే శాటిలైట్ రైట్స్ కొన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కల్కి మాత్రం విడుదలకు ముందే ఈ విషయంలో బిజినెస్ పూర్తిచేసింది. కల్కి సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. అటు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. 


దీనికి సంబంధించి ఈ రెండు ఒప్పందాల విలువ దాదాపు 6 కోట్ల రూపాయలు అని లేటెస్ట్ అప్డేట్. ఇక సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ ను ఎప్పుడో మంచి రేటుకు అమ్మేసిన సంగతి తెలిసిందే. ఇలా కల్కి సినిమాకు సంబంధించి పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు నిర్మాతలు. గరుడవేగ రిలీజ్ టైమ్ లో జీవిత ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి గురుతుండే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అంతా హ్యాపీగా బిజినెస్ పూర్తిచేయగలిగారు. ఇక ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 28న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కూడా మంచి హిట్ పడితే రాజశేఖర్ కి ఇక తిరుగుండదని ఇండస్ట్రీ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: