సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. కొరియన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సమంత ఒక వయసు మళ్ళిన లేడీ పాత్రలో కనిపిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడం..సమంత నటన ఎంతో చక్కగా ఉండడం తో దీనిపై అభిమానులు, సినీ ప్రేక్షకులు , దర్శక నిర్మాతలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
 
తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ ట్రైలర్ పట్ల ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ఓ బేబీ సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. సమంతా 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది. #OhBabyTrailer” అంటూ ట్వీట్ చేశారు.
అలాగే కింగ్ నాగార్జున సైతం ప్రశంసలు కురిపించారు. ఓ బేబీ ట్రైలర్ ను షేర్ చేస్తూ “సమంతా మళ్ళీ టార్గెట్ ను కొట్టేలా ఉంది. ట్రైలర్ చాలా నచ్చింది కోడలా” అంటూ ట్వీట్ చేశారు. నవదీప్.. ఈషా రెబ్బా..నాగ చైతన్య మొదలగు సినీ స్టార్స్ ‘ఓ బేబీ’ ట్రైలర్ ను ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: