గతంలో సమంత ఎంచుకున్న సినిమాలు, ఆ సినిమాలలో తన క్యారెక్టర్స్ గ్లామర్స్ గా రోటీన్‌గా ఉండేవి. ఈ విషయం సమంత చేసిన సినిమాలు చూసిన ఎవరికైనా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ పెళ్లయ్యాక టిపికల్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటుంది. రీసెంట్‌గా వచ్చిన మజిలీనే అందుకు పెద్ద ఉదాహరణ. మరో సారి సమంత అలాంటి ఒక టిపికల్ రోల్ లో నటించిన కొత్త మూవీ ఓ బేబీ థియోట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. కథలో కీలకమైన పాయింట్ ను ఈ ట్రైలర్‌లో రివీల్ చేశారు. 70 ఏళ్ళ వయసున్న బామ్మ ఓ సాయంత్రం పూట ఊహించని విధంగా ఏదో అద్భుతం జరిగి 24 ఏళ్ళ పడుచుపిల్లలా మారిపోతుంది.ఈ విషయాన్ని ఆవిడ స్నేహితుడు చెప్పినా బేబీ స్వంత కొడుకు నమ్మడు.


పడుచుపిల్లలా మారిపోయి బయటికి వచ్చిన బేబీని ఓ యువకుడు ఇష్టపడతాడు. ఆఖరికి బేబీ మనవడు కూడా ప్రపోజ్ చేయబోతాడు. పైకి శరీరం ఎలా మారినా లోపల మాత్రం 70 ఏళ్ళ ఫీలింగ్స్ తనలోనే ఉన్న బేబీ సమాజంలో తనకు ఎదురైన సవాళ్లు, సమస్యలు చిక్కుముళ్లు ఎలా దాటుకుని వచ్చిందో స్క్రీన్ మీద చూడాల్సిందే అంటున్నారు దర్శకురాలు నందిని రెడ్డి.


ట్రైలర్ చూస్తే కంప్లీట్ గా ఓ బేబీ సమంత సింగల్ హ్యాండెడ్ షో అని అర్థమైపోతోంది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్  చాలా ఉన్నప్పటికీ తనను బేస్ చేసుకుని అల్లిన కథ కావడంతో సమంత తన నటనతో సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళుతుందనడంలో ఏ సందేహము లేదనిపిస్తుంది.. నాగ శౌర్య డీసెంట్ గా, ఫ్లాష్ బ్యాక్ లో అడవి శేష్ ని సమంతకు పెళ్ళైన కొన్నాళ్లకె చనిపోయిన మిలిటరీ ఆఫీసర్ గా చూపించడం, రాజేంద్ర ప్రసాద్-రావు రమేష్ ల సీనియారిటీ మరో ప్లస్ అని తెలుస్తోంది. మరీ ఈ సినిమా రిలీజైయ్యక ఎలాంటి రికార్డ్స్ ను క్రియోట్ చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: