సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతి పెద్ద డిజాస్టర్ సినిమా నానీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ చిన్న పిల్లాడిగా ఉండి ఒక్కసారిగా పెద్ద వాడిగా మారే ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకు అలాంటి ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఓ బేబీ. డెభై ఏళ్ల మనసు, పాతికేళ్ల శరీరం ఈ కాన్సెప్ట్ తోనే ఓ బేబీ సినిమాను రూపొందించినట్ట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో సమంత, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. 


ఈ సినిమా అసలు కథేంటి..? అనేది ఇన్నాళ్లు క్లారిటీ ఎవ్వరికీ లేదు. డెభై ఏళ్ల బామ్మ, పాతికేళ్ల అమ్మాయిలా ఎలా మారింది? లాజికల్ గా ఎలా వుంటుంది అన్నది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు చిత్ర బృందం. అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఓ రాత్రివేళ మెరుపు మెరిసింది, బామ్మ బేబీ కాస్తా యంగ్ బేబీగా మారిందని రాజేంద్ర ప్రసాద్ పాత్రతో చెప్పించారు. బేబీ టైటిల్ సాంగ్ కూడా అలాగే వుంది. ''..ఏదో ఉల్క నేరుగా భూమి మీద వాలగా,, బేబీ అవతరించేగా..' అంటూ... డెభై ఏళ్ల బామ్మ అని తెలియక, పాతికేళ్ల అమ్మాయిగా కనిపించే సమంత చుట్టూ అబ్బాయిలు తిరుగడం, కానీ ఆమెకు తనేంటో తన మనసేంటో తెలిసి, మసులుకోవడం దీంట్లోంచి పుట్టే కామెడీ వరకు బాగానే వుందని సమాచారం. 


కానీ రాజేంద్రప్రసాద్ ఓవర్ యాక్షన్ ఎపిసోడ్ లు మాత్రం సినిమాలో ఎంతరకు వున్నాయో తెలియడం లేదు. అయితే మొత్తంగా ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫన్ తో పాటు మంచి హార్ట్ టచింగ్ సీన్లతో సినిమాను ఎండ్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజైయ్యాక ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సమంత ఏ మేరకు మ్యాజిక్ చేసిందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: