ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ కి అసోసియోట్స్ గా చేసిన డైరెక్టర్స్ కూడా సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ అనిపించుకోవాలనే రూలేమీ లేదని చాలా మంది డైరెక్టర్స్ అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసి ప్రూవ్ చేశారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే గొప్ప దర్శకుల జాబితాలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ప్రతిభ ఉన్న రాజమౌళి హాలీవుడ్ స్థాయి సినిమాలను తెరకెక్కించడంలో వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నారు. ఇప్పటివరకు రాజమౌళి కెరీర్‌లో ఒక్క డిజాస్టర్ కూడా లేకపోవడం గొప్ప విషయం. ఆయన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన దగ్గర ఎంతో మంది సహాయ దర్శకులుగా చేశారు... చేస్తున్నారు. అయితే వాళ్ళలో ఏ ఒక్కరు కూడా దర్శకులుగా మంచి గుర్తింపును పొందకోలేక పోయారు. రాజమౌళి శిష్యులు త్రికోటి, కరణ్ కుమార్ వంటి పలువురు దర్శకులుగా పరిచయం అయ్యారు. కాని వాళ్ళెవ్వరు సరైన సక్సెస్ ని దక్కించుకోలేదు. 


జక్కన్న శిష్యులు వచ్చిన వాళ్లు వచ్చినట్లుగానే వెళ్లి పోతున్నారు. ఒకటి రెండు సినిమాలకు మించి చేయడం లేదు. రాజమౌళి శిష్యుడు కరుణ్ కుమార్ దాదాపు పది సంవత్సరాల క్రితం 'ద్రోణ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ద్రోణ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కరుణ్ కుమార్ మరో ప్రయత్నం చేయలేదు. ఆయనకు మరెవ్వరు ఛాన్స్ ఇచ్చే సాహసం చేయలేదు. ద్రోణ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు ఆ దర్శకుడు మరో ప్రయత్నం చేశాడు.


కరుణ్ కుమార్ రీసెంట్‌గా 'పలాస 1978' అనే సినిమాని తెరకెక్కించాడు. లండన్ బాబులు సినిమాలో నటించిన రక్షిత్   హీరోగా నటించాడు. పీరియాడిక్ బ్యాగ్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, సినిమాకు సంబంధించిన విషయాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తప్పకుండా ఈ సినిమాలో  ఏదన్న మ్యాటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. రాజమౌళి శిష్యుల్లో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు అనే అపఖ్యాతిని ఈ సినిమాతో అయినా కరుణ్ కుమార్ జక్కన్నకు తొలగిస్తాడేమో చూడాలి. ఇక జక్కన్న అకౌంట్‌లో 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాని తెరకెక్కించిన పేట త్రికోటి కూడా ఫ్లాప్ డైరెక్టర్‌గానే మిగిలిపోయాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: