మెగాస్టార్ చిరంజీవి సౌతిండియా టాప్ స్టార్. ఆయన హీరోయిజం ఓ బ్రాండ్. ఆయన స్పూర్తిగా ఎంతో మంది వెండి తెర మీద తమ నటనను చూపించారు. ఎంతో మంది చిరుకు ఏక లవ్య శిష్యులు ఉన్నారు. అటువంటి మెగాస్టార్ కోట్లాది మంది అభిమానులకు దేవుడు. ఎంతో మంది హీరోయిన్లతో నటించిన చిరంజీవి వారికి కూడా  ఫావరేట్ స్టార్.


నయనతార ఫస్ట్ టైం చిరంజీవితో నటిస్తోంది. సైరా మూవీలో నయన చిరు కాంబో ఆ సినిమాకు ఓ ఆకర్షణ. నయన చిరుకు ఈ మూవీలో ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు కానీ చిరంజీవి మాత్రం కచ్చితంగా నయన కెరీర్ కు హెల్ప్ అయ్యేలా ఉన్నాడని అంటున్నారు.


ఈ ఏడాది వరసగా ఫ్లప్స్ తో కెరీర్ డౌన్ అయిన నయనతార చూపు ఇపుడు సైరా మూవీ మీదనే ఉందిట. ఈ మూవీ హిట్ అయితే చాలు మళ్ళీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని నయనతార సైరా మీద కోటి ఆశలు పెట్టుకుందట. ఈ మూవీ తెలుగులోనే కాదు. తమిళ్, కన్నడలో కూడా రిలీజ్ కావడంతో నయన్ మార్కెట్ మళ్ళీ ఓ రేంజికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నయన్ చూపు ఇపుడు చిరంజీవి మీదనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: