సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? హీరోల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ విషయాలన్ని సాధారణంగా బయటకు రావు. కొన్ని సార్లు అక్కడ జరిగే సంఘటనలు, బయటకు వచ్చే వార్తలు  భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య, మోహన్ బాబు మీద కొంత నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది.సెట్స్‌లో బాలయ్య చాలా కోపంగా ఉంటారని, చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, మోహన్ బాబు డిసిప్లిన్‌తో అందరినీ ఇబ్బంది పెడతారంటూ ఇలా రకరకాల ప్రచారం ఉంది.

 

అయితే తాజాగా ఇటువంటి విషయాలపై కరాటే కళ్యాణి స్పందించింది. ఈ విధంగా ఆమె మాట్లాడుతూ "ఎక్కడైనా నిజం కంటే అబద్దమే తొందరగా పాకుతుంది. కోపం అనేది ఎవరికైనా ఉంటుంది. మనకు కూడా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. అయితే బాయ్య, మోహన్ బాబు చాలా మంచి వ్యక్తులు. ఏదో ఒక సందర్భంలో కోపానికి గురైతే దాన్ని హైలెట్ చేసి పదే పదే ప్రచారం చేస్తున్నారని కళ్యాణి తెలిపారు."

 

వాళ్ళు చేసే పని మీద అంకితభావం ఉండే వ్యక్తుల్లో బాలయ్య, మోహన్ బాబును ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారికి టాలెంట్ ఉంది, వారిపై జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లు. నా ముందు సినిమా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే, లేనిది ఉన్నట్లు మాట్లాడితే కోపం వస్తుంది, వెంటనే రియాక్ట్ అవుతాను అని కళ్యాణ్ తెలిపారు. ఈ విధంగా జూ ఎన్టీఆర్ తో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది.

 

జూ ఎన్టీఆర్ ఆది సినిమా సమయంలో సెట్లో చాలా అల్లరి చేసేవాడు. తన అసిస్టెంట్ పైకి ఎక్కి గుర్రంలాగా అతడిని పరుగెత్తించేవాడు. ఒక వేళ అతడు బాధ పడితే దగ్గరకు తీసుకుని హగ్ చేసుకునేవాడు. చిన్న పిల్లల చేష్టలన్నీ చేసేవాడు. చేతికి బ్లడ్ ఉంటే షర్టుకు రాసేవాడు. అదో సరదా...ఇవన్నీ సెట్లో కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అపుడు నిజంగా తారక్ చేయి కట్ అయి బ్లడ్ వచ్చింది, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నట్లు కళ్యాణి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: