అంతకు ముందు యోగా అంటే అబ్బో అది మన వాళ్ళ కాదులే ఎవరో కొంతమంది మాత్రమే యోగా చేయగలుగుతారు అని అనుకునేవారు.  యోగ చేయడం అంటే చాలా కష్టం అని అభిప్రాయం కూడా ఉండేది.  ఇప్పుడు ఆ అనుమానాలకు చెక్ పడింది.  దేశంలోని చాలామంది యోగా చేస్తున్నారు.  ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.  


జూన్ 21 వ తేదీని ప్రపంచ యోగాడే గా గుర్తించి సెలెబ్రేట్ చేస్తున్నారు.  ప్రపంచ యోగా డేను తీసుకురావడం వెనుక మోడీ చేసిన కృషి అమోఘమైనది.  ఇక మన సెలెబ్రిటీలు ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తారు.  ఇవ్వాలి కూడా.  వాళ్ళు ఫిట్ గా ఉంటేనే సినిమాలు చూస్తారు.  


అందుకే నిత్యం జిమ్ లో గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు.  వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా చేస్తుంటారు.  నిత్యం దినచర్యలో భాగంగా ఈ యోగ అన్నది ఉంటుంది.  యోగాసనాలు చేయకపోతే ఇబ్బందుల్లో పడిపోయినట్టే.  


శిల్పాశెట్టి యోగాకు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తోంది.  నిత్యం యోగా చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటోంది.  అప్పుడు శిల్పాశెట్టి ఎలాగైతే యోగాద్వారా శరీరాన్ని కాపాడుకుంటుందో.. ఇప్పుడు దిశా పటాని, పూనమ్ పాండే  కూడా అదే రీతిలో యోగా చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటోంది.  కరీనా కపూర్, యోగా టీజర్ అనుష్క  వీళ్లంతా యోగ ద్వారానే పాపులర్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: