ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక పవన్ త్రివిక్రమ్ ల మధ్య లేటెస్ట్ గా జరిగిన చర్చల విషయమై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పవన్ ఎన్నికల ఓటమి తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే పవన్ త్రివిక్రమ్ ను తన ఇంటికి పిలిపించుకుని సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.

తాను ఎన్ని ఒత్తిడులు వచ్చినా సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదనీ అయితే తన ఆదాయం కోసం నిర్మాతగా కొనసాగుతానని దానికి త్రివిక్రమ్ సహాయం కావాలి అంటూ కోరినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తరువాత వచ్చే సంవత్సరం చరణ్ తో తాను ఒక సినిమాను స్వయంగా తీస్తానని ఆసినిమాకు దర్శకత్వం వహించమని పవన్ త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ కూడ పవన్ సూచనలకు స్పందిస్తూ తాను ప్రస్తుతం అల్లు అర్జున్ తో తీస్తున్న మూవీ నిర్మాణం పూర్తి అయిన తరువాత చరణ్ సినిమా కథ గురించి ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పవన్ తో ‘గోపాల గోపాల’ ‘కాటమరాయుడు’ సినిమాలను తీసిన దర్శకుడు డాలీ పవన్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథను వ్రాస్తున్నాడని అయితే ఈకథ పవన్ కాకుంటే ఎవరు నటిస్తారు అన్న విషయమై కూడ సందేహాలు కలుగుతున్నట్లు ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. 

పవన్ త్రివిక్రమ్ లు కలిసి గతంలో సహ నిర్మాతలుగా పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ అన్న బ్యానర్ క్రియేట్ చేసిన నేపధ్యంలో పవన్ చరణ్ తో తీయబోయే మూవీ ఇదే బ్యానర్ పై ఉంటుందా లేకుంటే మరో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తారా అన్న విషయమై స్పష్టత లేదు అన్న అభిప్రాయం ఆ కథనంలో కనిపిస్తుంది. అయితే పవన్ సినిమాలకు దూరం అని చెపుతున్నా ఇంకా అతడి చుట్టూ సినిమా వార్తలు వస్తూనే ఉన్న నేపధ్యంలో పవన్ ఫిలిం ఇండస్ట్రీ సెకండ్ ఎంట్రీ నిర్మాతగానా లేకుంటే హీరోగానా అన్న విషయం మరికొంత కాలం కొనసాగే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: