బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. పాపులరిటీ బాగా పెరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి  జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటినుండి అంచనాలు  ఉన్నాయి.బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది.

 

ఈ మధ్య "సాహో" సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజైన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది.  టీజర్ బాగుందంటూ   బాలీవుడ్ సెలెబ్రిటీలు  కామెంట్లు చేసారు. అయితే ప్రముఖ విశ్లేషకుడు "కె ఆర్ ఖాన్" మాత్రం విభిన్నంగా స్పందించాడు.   ఈయన ప్రతీ విషయంపై ట్విట్టర్ వేదికగా కామెంట్లు పెడుతుంటాడు.

 

అయితే వాటిల్లో కొన్ని సెన్సేషన్ అవుతుంటాయి. అలా "సాహో " టీజర్ పై చేసిన కామెంట్ వైరల్ అయింది. అతను టీజర్ ని చూసి, టీజర్ అంతా చిన్న పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లా ఉందని, ఈ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం అని జోస్యం చెప్పాడు. కానీ ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యినట్టున్నాడు. అతని ట్వీట్ అంచనాలు తారుమారయ్యాయి. ఈ టీజర్ తో రికార్డుల్ని బద్దలయ్యాయి.

 

ఈ రికార్డులను చూసి షాక్ తిన్న కెఆర్ ఖాన్ తన అభిప్రాయాన్ని మార్చుకొని.. ప్రభాస్ బాలీవుడ్ సూపర్ స్టార్ అని, సాహో సూపర్ హిట్ అవుతుందని చెప్పి మరో ట్వీట్ చేశారు. మొత్తం మీద తన మాట మార్చుకొని మరోసారి వార్తల్లో నిలిచాడు. అందుకని మళ్ళీ మాట మార్చాడు. దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు.ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో ఏక కాలంలో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: