రాజకీయం అంటే పైకి కనిపించే జేజేలు కాదు, చీత్కారాలు కూడా ఎన్నో ఉంటాయి. బయటకు కనిపించే వెలుగులే కాదు, ఎన్నో చీకట్లు ఉంటాయి. ఆకాశాంలో ఎగిరిన తారనే చూస్తారు కానీ పాతాళంలోకి పడిపోయిన వారిని అసలు గమనించరు. ప్రజలు ఒక్కటే కానీ  వారు ప్రేక్షకులుగా, ఓటర్లుగా రెండు విధాలుగా తీర్పులు ఇస్తూంటారు.


నాగబాబు బోల్డ్ గా మాట్లాడుతారు. అందువల్లనే ఆయన 2024లో పవన్ సీఎం అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఆయన అంచనా వేసి ఈ మాటలు అన్నారని ఎవరూ అనుకోరు. ఆయన‌ పూర్తిగా తన తమ్ముడి మీద అభిమానంతోనే ఇలా అన్నారని అంతా అనుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, ఆ పార్టీకి తాజా ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి.


ఇక అధినాయకుడు చంద్రబాబు. ఆయన రాజకీయ వ్యూహాలు వేరుగా ఉంటాయి. అధికారంలో ఉన్నది జగన్, ఆయన జగ మొండి. ఓడిన చోటే గెలుపు జెండా పాతేసిన వీరుడు. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీ మీద కమలానికి ఎన్నో ఆశలు ఉన్నాయి. మొత్తానికి చెప్పేదేంటంటే 2024 నాటికి కూడా ఏపీలో రాజకీయ శూన్యత ఉండబోదు అని. పవన్ సీఎం అని అనుకోవచ్చు.


ఆయనకు అయ్యే అర్హత కూడా ఉంది, ఎవరూ కాదనరు, కానీ దానికి తగ్గట్లుగా ఆయన విధానాలు రూపొందించుకుని ఈ రోజు నుంచి జనంలో ఉంటేనే అప్పటికి కొంతవరకైనా ఫలితం ఉండేది. మరి నాగబాబు ఫ్యాన్స్ కోసం మా వాడే సీఎం అని అనుకుంటే మాత్రం లాభం ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: