పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రామ్ తాళ్ళూరి పవన్ కోసం మొన్నటి ఎన్నికలలో చాల కృషి చేసాడు. పవన్ కోసం ఒక స్పెషల్ టీమ్ ను తయారుచేసి సోషల్ మీడియాలో పవన్ ‘జనసేన’ కోసం విపరీతమైన ప్రచారం చేయించాడు. 

పవన్ ఆశయాలను ప్రచారం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ‘99’ ఛానల్ ప్రమోటర్స్ లో రామ్ తాళ్ళూరి పాత్ర కూడ ఉంది అని అంటారు. ప్రస్తుతం సినిమాల పై విరక్తి పెంచుకుని భీష్మ ప్రతిజ్ఞ చేసి సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ మనసును మార్చడానికి రామ్ తాళ్ళూరి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక స్పెషల్ టీమ్ ను తయారు చేసి పవన్ కు మైండ్ వాష్ ఇచ్చే పని ప్రస్తుతం చేస్తున్నట్లు సమాచారం. 

రాజకీయాలలో గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా మరొక 25 సంవత్సరాలు జనం మధ్య ఉంటానని పవన్ చెపుతున్న నేపధ్యంలో పవన్ కు ఎటువంటి మీడియా సపోర్ట్ లేకుండా ఇది జరిగే పనేనా అంటూ ఆ టీమ్ ప్రస్తుతం పవన్ కలిసి ప్రశ్నిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఒక పత్రిక మరొక ఛానల్ లేకుండా ప్రస్తుత కాలంలో జనం మధ్య ఉండటం కష్టమని అలాంటి ప్రయత్నాలు చేసినా జనం పట్టించుకోరని ఆ స్పెషల్ టీమ్ ప్రస్తుతం పవన్ మైండ్ ను సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు పవన్ రాజకీయంగా ఫెయిల్ అయినా సినిమాలు చేయాలని దర్శకులు నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్న పరిస్థుతులలో ఈవిషయాన్ని తెగేదాక లాగితే ఆతరువాత పవన్ వైపు చూసేవారు ఉండరు అని చెపుతూ హీరోగా నటించే అభిప్రాయం లేకుంటే కనీసం అతిథి పాత్రలు అయినా చేసి వచ్చే 5 సంవత్సరాలలో జనం మధ్య తన ఇమేజ్ ను కొనసాగించమని చెపుతూ ఆ టీమ్ చెపుతున్న విషాయలను పవన్ మౌనంగా వింటున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ‘తానా’ మహాసభలకు వెళుతున్న నేపధ్యంలో అక్కడ కూడ ఇలాంటి ఒత్తిడి వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: