మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎంత ఇష్టపడతారో తెలుసు. ఆయన మానరీజం..స్టైల్, ఫైట్స్ ఫిదా అయ్యే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్.  హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే పవన్ కళ్యాన్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించారు.  అప్పడు మాత్రం పోటీ చేయలేదు..కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి దారుణమైన ఫలితాన్ని పొందారు. 

అయితే తాము ఎందుకు ప్రజల నమ్మకాన్ని పొందలేదే పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాన్ అప్పటి వరకు  తెల్ల పంచె, తెల్ల లాల్చీ, గెడ్డంలో కనిపించారు. మొన్నటి నుంచి ఆయన లుక్ లో తేడా వచ్చింది..స్టైల్ గా ట్రిమ్మింగ్ చేసుకొని గల్ల చొక్క, జీన్స్ లో కనిపించారు.  ఇంకేముందు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..పవన్ కళ్యాన్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెగ వార్తలు వచ్చాయి.  అయితే పార్టీని బలోపేతం చేస్తాను కానీ సినిమాలు చేయను అని పవన్ ఇప్పటికే ప్రకటించారు.మరి ఏమిటీ కూల్ లుక్ అంటారా...దాని వెనుక ఓ కథ ఉంది.


పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే అమెరికాలో జరగబోయే తానా సభలకు వెళ్లనున్నారు.  పవన్ కళ్యాణ్ రెగ్యులర్ లుక్‌లోకి రావాలని తానా నిర్వాహకులు రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు. అందుకోసమే పవన్ గెడ్డం తీసారని తెలుస్తోంది. గత ఆరు నెలల నుంచి గుబురు గడ్డంతో అభిమానులకు కనిపించిన పవన్ ఒక్కసారే స్మార్ట్ లుక్ తో రంగు బట్టలతో కనిపించడం వీరాభిమానులకు సైతం ఆనందాన్ని ఇస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: