మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం అటు సినిమాలతోపాటు, ఇటు సినిమాల్లో కూడా అక్కడక్కడా నటిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి మెగాబ్రదర్ నాగుబాబు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేసిన నాగబాబు, పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక మూడు రోజుల క్రితం తన తనయుడు వరుణ్ తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాద ఘటన వినగానే కొంత భయం వేసిందని, అయితే ప్రమాదం నుండి సురక్షితంగా బయపడ్డాడని తెలియడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని మొన్న ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగబాబు. 

ఇకపోతే తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి కూడా నాగబాబు మాట్లాడారు. జీవితంలో ఎవరికైనా ఒక్కో సందర్భంలో ఓటమి తప్పదని, అయితే దానిని మంచి గుణపాఠంగా తీసుకుని ముందుకుసాగితే మెల్లగా అయినా విజయం దక్కుతుందని అయన అన్నారు. జనసేన మొదటిసారి పోటీ చేసినపుడు ఓడిపోయినదని, ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోవడం పొరపాటని అన్నారు. ఇక తాను నరసాపురం నుండి ఓడిపోయినప్పటికీ ఇకపై అవకాశం ఉన్నంతవరకు అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని, తనకు పదవులకంటే ప్రజాక్షేమమే ముఖ్యమన్నారు. ఇక తమ్ముడు పవన్ కనీసం ఫ్యాన్స్ కోసం ఒక్క సినిమా చేయాలని ఎందరో ఫ్యాన్స్ తనని అడుగుతున్నారని అన్నారు. 

అయితే పవన్ మాత్రం తనకు తెలిసినంతవరకు భవిష్యత్తులో సినిమాల్లో నటించరని, తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని పవన్ భావిస్తున్నారని అన్నారు. అలానే తన అన్నయ్య చిరంజీవికి రాజకీయాలపట్ల ప్రస్తుతం పెద్దగా ఆసక్తి లేదని, అందుకే అయన ఇకపై ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారని అన్నారు. ఇక తన అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటారని, కాబట్టి తమ ఫ్యాన్స్ అందరూ ఈ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని అయన కోరారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: