నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మల్లేశం’. రాజ్‌ కిరణ్‌ దర్శకుడు. తెలంగాణకు చెందిన చింతకింది మల్లేశం అనే వ్యక్తి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన క్రింది విషయాలు పేర్కొన్నారు..

 

చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలని అనుకోలేదు. ఓ కంపెనీలో నా చదువుకు తగ్గ ఉద్యోగంలో చేరాను. కొన్నాళ్ల తర్వాత షార్ట్‌ ఫిలింలు చేశాను. దాంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. నటన వైపు ఎందుకు అడుగులు వేయకూడదు అనుకున్నాను. అలా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తీసిన ‘జునూన్‌’ షార్ట్‌ ఫిలింలో నటించాను. అప్పటికే ఆయన నాకు పరిచయం కావడంతో ‘పెళ్లి చూపులు’ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చారు.

 

ఆ తర్వాత ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘అ’ సినిమా ద్వారా అజయ్‌ అనే అసిస్టెంట్‌ దర్శకుడు పరిచయమయ్యారు. చింతకింది మల్లేశం గురించి చెప్పారు. కొన్ని రోజుల తర్వాత దర్శకుడు రాజ్‌ కిరణ్‌ మల్లేశం జీవితాధారంగా సినిమా చేద్దామని అన్నారు. అయితే నేను ఇప్పటివరకు మల్లేశం జీవితంలోని ఇలాంటి ప్రేమకథను ఎప్పుడూ వినలేదు.

 

అంటే ఇక్కడ నేను ఆయన భార్య గురించి మాట్లాడటంలేదు. ఆయన తల్లి గురించి చెబుతున్నాను. మగ్గం పనులు చేస్తున్న సమయంలో ఆయన తల్లి, భార్యతో ఈ వృత్తిలో ఉన్న ఇతర ఆడవాళ్లు ఎంతో కష్టపడేవారు. తన తల్లి కష్టం చూడలేక మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెట్టారు.. అని ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: