నటుడు నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఒక మీడియా సమావేశంలో నవీన్‌ మాట్లాడుతూ...

 

ఇప్పుడు నేను చేసిన సినిమాకు ముందు ‘గూఢచారి’ అన్న టైటిల్‌ను అనుకున్నారు. కానీ అప్పటికే అడివి శేష్‌ ఆ టైటిల్‌తో సినిమా చేశారు. దాంతో దర్శకుడు ఈ టైటిల్‌ను ఎంచుకున్నారు. కథేంటంటే.. శ్రీనివాస్‌ అనే ఏజెంట్‌ కూరగాయల మార్కెట్‌లో చిన్న ఆఫీస్‌ పెట్టుకుంటాడు. తెలివి గలవాడు. అతనికి ఓ మర్డర్‌ కేసును డీల్‌ చేసే ఆఫర్‌ లభిస్తుంది. ఎలా డీల్‌ చేశాడన్నది తెరపై చూడాలి!

 

ఒకప్పుడు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేసేటప్పుడు విజయ్‌ దేవరకొండ పరిచయమయ్యారు. ఈ సినిమా టీజర్‌ విడుదలయ్యాక విజయ్‌ ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో విజయ్‌ పాత్ర నాకు దక్కాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని చెప్పారు. అతని నేపథ్యంగురించి ప్రస్తావిస్తూ...

 

మా నాన్న వ్యాపారవేత్త. తల్లి బ్యాంక్‌ ఉద్యోగి. నాది హైదరాబాదే. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయి వెళ్లాను. అక్కడ పలు హిందీ సినిమాల్లో నటించాను. ‘ఏఐబి’ యూట్యూబ్‌ ఛానెల్‌లో పలు కార్యక్రమాలు కూడా చేశాను. ఈ వీడియోల ద్వారా దక్షిణాది నుంచి అవకాశాలు వచ్చాయి. స్వరూప్‌ నాకు ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కథ చెప్పారు. ఇదో డిటెక్టివ్‌ కథ అనగానే వెంటనే ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: