పవన కళ్యాణ్  ట్రెండ్ ను సెట్ చేస్తారు గాని..  ఆ ట్రెండ్ ను ఫాలో అవ్వరు.  తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత టాప్ రేంజ్ కు ఎదిగారు.  మెగా ఫ్యామిలీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు . సినిమా రంగంలోనే ఉంటె పవన్ కు తిరుగుండేది కాదు.

 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయాలనీ అనుకున్నారు.  దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుందని అనుకున్నారు.  ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమాలకు దూరంగా ఉన్నారు. 

 

అయితే, ఇన్నాళ్లకు మరలా ఈ సినిమా గురించిన న్యూస్ బయటకు వచ్చింది.  పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగాఉన్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా ఉండబోతుంది.  పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సినిమా ఉండొచ్చని అంటున్నారు. 

 

అయితే, పవన్ మాత్రం సినిమా రంగానికి దూరం అని చెప్తున్నారు.  సినిమా రంగానికి దూరం అని చెప్తే చెప్పొచ్చు.  సినిమాను నిర్మిస్తే సరిపోతుంది కదా.  మూడేళ్ళ క్రితం అనుకున్న ప్రాజెక్ట్ ను ఇప్పుడు అమలు చేస్తే అటు చరణ్ కల నెరవేరినట్టు ఉంటుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: