బిగ్ బాస్ 3 స్టార్ అవటానికి రంగం సిద్ధం అయింది. ఈ షోకు వ్యాఖ్యాతగా నాగార్జున నటిస్తున్న సంగతీ తెలిసిందే.  రీసెంట్ గా 'బిగ్ బాస్ 3 కమింగ్ సూన్' అంటూ ఒక శాంపిల్ వీడియో విడుదల చేశారు. తాజాగా స్టార్ మా వారు బిగ్ బాస్ 3 ప్రోమోను వదిలారు. ఒక బాబా లాంటి స్వామీజీ ఒక చోట కూర్చొని ప్రవచనం ఇస్తూ ఉంటారు. "మనసు ఓ కోతి లాంటిది.


మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే..  మమకారంతో వెటకారంతో వారిని ఏకతాటిపైకి తెచ్చేది ఎవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు?" అంటూ పవర్ ఫుల్ మాస్ సినిమాకు ట్రెడిషనల్ స్టైల్లో ఇంట్రో ఇస్తూ ఉంటే కింగ్ అక్కినేని నాగార్జున హుడ్ ఉండే టీ షర్ట్ ధరించి మొహం కనిపించకుండా నడుస్తూ ఉంటారు.  ఒక బాబు బిగ్ బాస్ 3 కమింగ్ సూన్ పోస్టర్ లు గోడకు అంటిస్తూ ఉంటే..  దానికి పక్కగా నాగ్ ఆ పోస్టర్ ను వేలితో చూపిస్తూ స్టైల్ గా నడుస్తూ వెళతాడు. 


ఫైనల్ టచ్ అన్నట్టుగా రోడ్ లో నడుస్తూ అలా కొంచెం వెనక్కు తిరుగుతాడు.ఈ ప్రోమోతో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే విషయం అధికారికంగా కన్ఫాం అయిపొయింది.  అయితే కంటెస్టెంట్ల వివరాలు.. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే వివరాలు ఇంకా  వెల్లడించలేదు.  మొదటి సీజన్లో జూనియర్ ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని హోస్టులుగా వ్యవహరించారు.  ఇప్పుడు మూడవ సీజన్ హోస్టుగా నాగ్ ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: