తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 త్వరలో ప్రారంభం కానున్నది.  దీనికి సంబంధించిన ప్రమోషన్ మొదలైంది.  మొన్నటి వరకు బిగ్ బాస్ లో ఎంట్రీ కాబోతున్న సెలబ్రెటీల గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ బిగ్ బాస్ లో కనిపించబోతుందన్న వార్తలను ఆమె ఖండించారు. తనతో ఇప్పటి వరకు ఎవరూ కాంటాక్ట్ చేయలేదని ఒకవేళ ఇందులో హూస్ట్ గా వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు.


ఇక పటాస్ యాంకర్ శ్రీముఖ ‘బిగ్ బాస్ 3’ లో సందడి చేయబోతుందని వార్తలపై ఆమె స్పందించి అలాంటిది ఏదీ లేదని..తనను కూడా ఎవరూ సంప్రదించలేదని అన్నారు.  ఇలా గుత్తా జ్వాలా జబర్ధస్త్ యాంకర్ రష్మి, సుధీర్ ల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు బిగ్ బాస్ యాజమాన్యం వీటిపై ఎలాంటి స్పందన తెలపలేదు. 


ఈ మద్య మాత్రం బిగ్ బాస్ 3 సీజన్ కి నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు.  ఇటీవల ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. కానీ ఈ షో ఎప్పుడు మొదలవుతుందో అన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  తాజాగా ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది. 

ఈ ప్రోమోలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లడం..చిన్నగా ఫేస్ టర్నింగ్  ఇవ్వడం చూపించారు.  కాగా, ఆ నడక స్టైల్.. లుకింగ్ ని బట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా నాగార్జుననే అంటున్నారు ప్రేక్షకులు. వచ్చే నెల నుండి ఈ షో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: