పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ దారుణంగా ఓటమి పాలవడం మరియు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కూడా ఓడిపోవడం మెగా అభిమానులతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా తీవ్ర ఆవేదనకు గురి చేయడం జరిగింది. దీంతో జనసేన పార్టీకి ప్రత్యర్థిగా ఉండే పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పి యూటర్న్ చేసుకొని సినిమాలు చేస్తారని విమర్శలు చేయడం జరిగింది.


దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి సినిమాలు ఇక నా జీవితంలో చేయను అని చెప్పి నా పూర్తి మిగిలి ఉన్న జీవితం ప్రజా సమస్యల కోసం పోరాటం అని పేర్కొనడం జరిగింది. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెర్రీతో కలిసి నటించడం కాదు గాని నిర్మాతగా రామ్ చరణ్ తో సినిమా నిర్మించడానికి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.


పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ అనేది ఉంది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నారు అనే వార్తలు కూడా వినపడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రొడ్యూసర్ గా రాంచరణ్ ని హీరోగా పెట్టి తన స్నేహితుడు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: