రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రారంభించిన ముహూర్తం బాగా లేదా అంటూ ఇప్పటికే కామెంట్స్ వస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ లో చరణ్ జూనియర్ లకు గాయాలు తగలడంతో పాటు బ్రిటీష్ నటి డైసీ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం లాంటి ఎన్ని సమస్యలు ఎదురైనా రాజమౌళి మాత్రం తన ఏకాగ్రత సడలి పోకుండా ఈమూవీ షూటింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ప్లాన్ చేసుకున్న అహ్మదాబాద్ షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే మళ్ళీ ఈ షెడ్యూల్ ను వచ్చే నెల నుండి ప్రారభం కావలసి ఉంది. ఈ షెడ్యూల్ లో అలియా భట్ రామ్ చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయడానికి రాజమౌళి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అలియా భట్ తాను వచ్చే నెలలో అహ్మదాబాద్ షెడ్యూల్ కు అందుబాటులో ఉండలేనని చెప్పినట్లు సమాచారం.

దీనికి కారణం ఆమెకు ఏర్పడిన అనారోగ్యం అలియా భట్ ‘బ్రహ్మాస్త్ర’ మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె పేగులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆ విషయాన్ని పెద్దగా శ్రద్ధ పట్టకపోవడంతో ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పెరిగి ఆమెకు సమస్యగా మారిందని తెలుస్తోంది. దీనితో డాక్టర్ల సలహా మేరకు ఆమె కొద్ది రోజులు షూటింగ్ కు దూరంగా ఉండాలని నిశ్చయించుకావడంతో మరొకసారి అహ్మదాబాద్ షెడ్యూల్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో కాలం వృధా కాకుండా కేవలం చరణ్ జూనియర్ల పై మరికొన్ని సన్నివేశాలు రాజమౌళి తీస్తాడా లేదంటే మరొకసారి ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడుతుందా అన్న విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. ఇన్ని అవాంతరాల మధ్య నడుస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తీరును పరిశీలిస్తున్న వారు ఈమూవీ విడుదల వచ్చే ఏడాది జూలైలో ఉంటుంది అన్న నమ్మకం రోజురోజుకు తగ్గిపోతోంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: