వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. అంతకాదు ఇపుడు ఏకంగా దర్శకుడు చేయాల్సిన పని కూడా తనే చేస్తున్నాడట.

 

కొత్త దర్శకుడు భరత్ కమ్మ.. విజయ్ దేవరకొండ హీరోగా 'డియర్ కామ్రేడ్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కదా. ఐతే ఈ సినిమా షూటింగ్ దాదాపు షూటింగ్ పూర్తైంది. ఐతే ఇప్పటివరకు తనపని తాను చూసుకు పోయే విజయ్ ఇప్పుడు మాత్రం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడట.

 

సినిమాలో ఏ సీన్ ఉంచాలి..? ఏది తీసేయాలనే విషయాన్ని దేవరకొండ డిసైడ్ చేస్తున్నాడట. విజయ్ మీద నమ్మకంతో నిర్మాతలు కూడా అతడిని ఏమీ అనడం లేదని టాక్ వినిపిస్తోంది విజయ్ దేవరకొండ ఇన్వాల్వ్‌మెంట్ పై దర్శకుడు భరత్ కమ్మ బాగా విసిగిపోయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాడని సమాచారం.

 

అయితే మా రౌడీ ఏం చేసిన అది బాగానే ఉంటుందని చెపుతున్నారు పిల్ల రౌడీలు. అదే నండి... అతని అభిమానులు.  అన్నట్టు, అతనికి దర్శకత్వం లో కూడా అనుభవం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదైతే నేం... సినిమా సక్సెస్ అయితే ఇకనుండి మన రౌడీ తన సినిమాలను తానే డైరెక్ట్ చేసుకొనే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: