బాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ తెలుగులో నితిన్ తో ‘హార్ట్ ఎటాక్’ అల్లు అర్జున్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీలతో పాటు ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘క్షణం’ లాంటి హిట్ సినిమాలలో నటించి వచ్చేవారం విడుదల కాబోతున్న రాజశేఖర్ మూవీ ‘కల్కి’ లో కూడ నటించింది. ఈమె నటించిన సినిమాలు చాలామటుకు విజయవంతం అయినా యూత్ లో ఈమెకు చెప్పుకోతగ్గ క్రేజ్ లేదు. 

దీనితో ఈమెకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. అయితే ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడూ అందరి దృష్టిలో పడటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఈమె ఒక హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. 

దీనికి ‘ది హాలీడే’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సహజంగానే ఆదాశర్మ తన హేర్‌స్టైల్‌ను డిఫెరెంట్‌గా రూపు దిద్దుకోవడంలో ఆసక్తి కనబరుస్తుంది. అలా ప్రస్తుతం తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ కోసం తన హేయిర్ ర్‌ను త్రివర్ణంతో తీర్చిదిద్దుకుంది. పర్పల్ పింకు ఆరెంజ్‌ రంగులతో కూడిన హేర్‌స్టైల్‌ కలిగిన ఒక అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

త్వరలో రాబోతున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇలా తన హేయిర్ స్టైల్ ను డిజైన్ చేసుకున్నాను అని చెపుతూ ఎవరైనా తన హెయిర్ స్టైల్ ను కాపీ కోడితే వారి పై తాను చర్యలు తీసుకుంటాను అని అంటూ ఆ హెయిర్ స్టైల్ కాపీ రైట్స్ తనకు మాత్రమే సొంతం అని చెపుతోంది. అంతేకాదు తన హెచ్చరికలు లెక్కచేయకుండా ఎవరైనా సరే తన హెయిర్ స్టైల్ ను అనుకరిస్తే తాను కేసులు వేస్తాను అంటూ బెదిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: