వయస్సు, 75 దాటినా కూడా ఇప్ప‌టికీ ఏదో ఒకటి కొత్త‌గా ట్రై చేయాల‌ని చూస్తుంటాడు ఈయ‌న‌. అందులో భాగంగానే 'పా, ష‌మితాబ్, పింక్' లాంటి ఎన్నో అద్భుత‌మైన సినిమాలు మనకు ఆయన నుండి వ‌చ్చాయి. ఇక ఇప్పుడు మ‌రో సెన్సేష‌న‌ల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు బిగ్ బి.

 

సినిమా పరిశ్రమలలో కొందరు హీరోలు ఒక స్టేజి తరువాత రిటైర్ అయిపోతున్నారు, కానీ అమితాబ్ ఇప్ప‌టికీ చేతినిండా సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక ద‌ర్శ‌కులు కూడా ఈయ‌న కోసం ప్ర‌త్యేకంగా క‌థ‌లు రాస్తున్నారు.. పాత్ర‌లు సృష్టిస్తున్నారు. నిర్మాతలైతే చెప్పనక్కర్లేదు! ఆయనకోసం పడిగాపులు కాస్తున్నారు.

 

మొన్న‌టి వ‌ర‌కు ఈయ‌న ‘చెహరే’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మ‌రో సినిమాతో బిజీ అయిపోయాడు బిగ్ బి. సుజీత్ సర్కార్ తెర‌కెక్కిస్తున్న గులాబో సితాబో సినిమా చిత్రీక‌ర‌ణ‌లో మూడు రోజుల నుంచి పాల్తొంటున్నాడు అమితాబ్. అందులో భాగంగానే షాకింగ్ మేకోవ‌ర్ అయ్యాడు.

 

పెరిగిన గడ్డంతో ముస్లిం వృద్దుడి పాత్ర‌లో ఇందులో న‌టిస్తున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్. అక్క‌డున్న‌ది ఆయ‌నే అని గుర్తు ప‌ట్ట‌డానికి కూడా చాలా స‌మయం ప‌డుతుందంటే ఎంత‌గా మెగాస్టార్ లుక్ మారిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. 2020 ఏప్రిల్ 24న విడుదల కానుంది. ఈ సినిమాతో మ‌రో సంచ‌ల‌నం సృష్టించాల‌ని భావిస్తున్నాడు బిగ్ బి.


మరింత సమాచారం తెలుసుకోండి: