ఈ మద్య హీరోయిన్లు సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  గ్లామర్ కన్నా నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం నెగిటీవ్ పాత్రల్లో నటించడానికైనా సిద్ద పడుతున్నారు.  తాజాగా కోటీవుడ్ బ్యూటీ అమలాపాల్ నటించిన ‘ఆడై’ తెలుగు లో ‘ఆమె’ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది.  అందుకు కారణం ఈ టీజర్ చివర్లో అమలాపా ఒంటిపో నూలు పోగులేకుండా నగ్నంగా కనిపించడం.  అయితే కొంత మంది ఈ టీజర్ పై దుమ్మెత్తి పోశారు..ఒక సెలబ్రెటీ అయి ఉండి ఇలాంటి నగ్న ప్రదర్శ ఏంటని ప్రశ్నించారు. 

సెలబ్రెటీలు కొంతమంది అబ్బో ఆమె సహజన నటనకు ఎంతో గొప్పగా ఉందని ప్రశంసలు కురిపించారు.  పాత్ర కోసం ప్రాణం పెట్టింది అని అంటున్నారు. దింతో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైను ఈ మూవీలో ఇటువంటి షాట్స్ చాలానే ఉంటాయని చిత్ర వర్గాలు చెప్పాయి. కానీ అమలాపాల్ కి సెన్సార్ భారీ షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

మూవీ లో ఉన్న పలు నేక్‌డ్ షాట్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. వాటిని తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని చెప్పారట. దాంతో ఈసినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. మరి నెటిజన్లు ఈ సీన్లు చూసి ఫిదా అయినవారు వాటిని తొలగిస్తే ఎంతవరకు మూవీని ఆదరిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: