టాలీవుడ్, కోలీవుడ్ లో విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది అక్కినేని సమంత.  ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ టాక్ వచ్చినవే. అక్కినేని నాగ చైతన్య తో వివాహం జరిగిన తర్వాత ఆమె అసలు సినిమాల్లో నటిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి..కానీ వరుస హిట్స్ తో ఇతర హీరోయిన్ల మతులు పోగొడుతుంది.  త్వరలో సమంత నటించిన ‘ఓ బేబీ’సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ మూవీలో సరికొత్త సమంతను చూడబోతున్నారట.  


సాధారణంగా టాలీవుడ్,కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్లు వెంటనే బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు..ఓకే అయితే సరి లేదంటే తిరిగి దక్షిణాది వైపు వచ్చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..అసలు నాకు నార్త్ ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో తెలియదు, వాళ్ళు ఏమి కోరుకుంటారో తెలియదు. వాళ్ళ అభిరుచుల పై నాకు అంతగా అవగాహన కూడా లేదు.  నేను ఒక ఏలియన్ లా కనిపిస్తా వాళ్ళకి... అందుకే నేను నార్త్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు.


 మొదటి నుంచి ఇక్కడి ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు..అలాంటి సమయంలో బాలీవుడ్ లోకి వెళ్లి చేతులు కాల్చుకోదల్చుకోలేదు.  అయినా నేను సౌత్ ప్రేక్షకుల కోసం చాలానే చేయాలి. ఇంకా మంచి కథలు, పాత్రలు చేసి వారి మెప్పించాలి” అని అంటుంది సామ్. ప్రస్తుతం నటించిన ఓ బేబీ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చింది సామ్.


మరింత సమాచారం తెలుసుకోండి: