టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కోలీవుడ్ లోనూ సూపర్ స్టార్ రజనీ కాంత్ తర్వాతే అన్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సైరా బిజినెస్ వ్యవహారం. సైరా సినిమా షూటింగ్ దాదాపు పూర్తవగా ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. కానీ శాటిలైట్, డిజిటల్ విషయాని కొచ్చేసరికి మాత్రం కాస్త వెనక్కి తగ్గుతున్నారు ఈ మూవీ మేకర్స్. దీనికి కారణం రజనీకాంత్ నటించిన 2.ఓ సినిమా. బిజినెస్ వ్యవహారంలో రజనీ తో కంపేర్ చేయడంతోనే అసలు సమస్య తలెత్తింది.


రజనీకాంత్ నటించిన 2.ఒ సినిమా శాటిలైట్+డిజిటల్ డీల్ లో సౌత్ లోనే అతిపెద్ద రికార్డు. ఏకంగా 110 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్ముడుపోయాయి. ఇప్పుడా రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు సైరా టీమ్. అయితే ఇది వర్కౌట్ అవుతుందా అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది. అయితే ఇలా కంపేర్ చేయడం మాత్రం ఒకరకంగా కరెక్ట్ కాదేమో అన్న ఆలోచన కొంతమందిలో లేకపోలేదు. ఎందుకంటే అక్కడ శంకర్ ఉన్నాడు. ఇక్కడ సురేందర్ రెడ్డి ఉన్నాడు..ఇద్దరికి మార్కెట్ పరంగా అసలు కంపేర్ చేయలేము. ఈ విషయం సైర బృందానికి  అర్థమవుతుందా..! అన్నదే అనుమానం. 


2.ఓ సినిమాలో రజనీకాంత్ తో పాటు అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. బాలీవుడ్ లో వంద కోట్ల హీరో అక్షయ్ అన్న సంగతి తెలిసిందె. పైగా చిరంజీవితో పోలిస్తే రజనీకాంత్ కు బాలీవుడ్ లో ఫ్యాన్స్ కాస్త ఎక్కువే. కాబట్టి అతడి సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. సైరా విషయానికొచ్చేసరికి ఈ ఎలిమెంట్స్ కాస్త తగ్గాయి. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో 110 కోట్లు టార్గెట్ ను అందుకోవడం సైరా కు సవాలే.  



మరింత సమాచారం తెలుసుకోండి: