తెలుగు, తమిళ భాషల్లో అప్పట్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కాంత్ అందరికీ గుర్తే ఉంటారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందారు. కానీ అది పెద్దగా వర్క్ ఔట్ కాలేదని..ఇటీవల జయలలిత సమాధి వద్దకు వచ్చినపుడు సహచరుల సహాయంతో నడిచి వచ్చిన పరిస్థితి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. తాజాగా జయ్ కాంత్ ఆస్తులను ఓ జాతీయ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

రూ.5 కోట్ల అప్పు కట్టకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 'ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' పేరుతో విజయ్ కాంత్ ఓ సంస్థను నడిపిస్తున్నారు. దీనిపేరు మీద ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. అయితే బ్యాంక్ వరు ఎంత సమయం ఇచ్చినా విజయ్ కాంత్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతోనే ఈ ఆస్తులు వేలం వేస్తున్నట్లు సమాచారం.

అయితే ఆస్తుల వేలానికి పర్మిషన్ ఇస్తూ.. విజయ్ కాంత్, అతడి భార్య ప్రేమలతా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రకటన చూసిన అభిమానులు కొందరు విజయ్ ఆస్తులను దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే విజయ్ కాంత్ 'డిఎండికె' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ మద్య జరిగిన ఎన్నికల్లో 'డిఎండికె' చిత్తుగా ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: