మంచు విష్ణు హీరోగా కార్తిక్ రెడ్డి డైరక్షన్ లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓటర్. ఈ సినిమా రిలీజ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా కథ బాగానే ఉందన్న టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుంటే సినిమా హిట్ అయ్యేదని అంటున్నారు. మంచు విష్ణు కెరియర్ పరంగా పూర్తిగా ట్రాక్ తప్పినా ఓటర్ టాక్ అతనికి ఖుషి అయ్యేలా చేస్తుంది.


అంతేకాదు ఈ సినిమా ఆఫ్టర్ ఎలక్షన్స్ రిలీజ్ అవడం కూడా సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా చేసింది. రిలీజ్ వాయిదా పడటమే కారణం అనుకుంటే సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ప్రేక్షకులకు సినిమా రీచ్ అవలేదని అంటున్నారు. ఏ సినిమా అయినా సరే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అలాంటిది మంచు విష్ణు ఓటర్ సినిమాపై ఆశలు వదులుకున్నాడు.


అందుకే దర్శక నిర్మాతలే ఈ సినిమా రిలీజ్ ముందు హడావిడి చేశారు. ఇక సినిమాలో మంచు విష్ణు సరసన నటించిన సురభి కూడా పెద్దగా పాపులర్ కాలేదు. అందుకే సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. అయితే సినిమా చూసిన ఆడియెన్స్ మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే విష్ణుకి హిట్ దక్కేదని అభిప్రాయపడుతున్నారు.


సో మంచు విష్ణు ఓ మంచి ఛాన్స్ మిస్సయ్యాడని చెప్పొచ్చు. ఓటర్ గా తన సత్తా చాటుతాడని అనుకున్న విష్ణు రిలీజ్ టైం లో అసలు పట్టించుకోలేని విధంగా పరిస్థితి మారింది. మధ్యలో దర్శక నిర్మాతలతో గొడవ కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల ఫోకస్ డైవర్ట్ అయ్యేలా చేసింది. మరి తన తర్వాత సినిమాతో అయినా విష్ణు అలరిస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: