రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రానా సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది.

 

టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకనిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో రానా .. సాయిపల్లవి పాత్రలు ఎలా వుంటాయనే ఆసక్తి కూడా అభిమానుల్లో పెరిగిపోతోంది. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో రానా కనిపించనున్నాడనీ .. జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు.

 

నక్సలైట్ గా అజ్ఞాతంలో వున్న రానాను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన సాయిపల్లవి ఆయన ప్రేమలో పడుతుందట. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఉత్కంఠభరితంగా వుంటాయని చెబుతున్నారు.

 

ఏదిఏమైనా, ఎలాంటి పాత్ర అయినా, రానాకి పెట్టింది పేరు. మొదటినుండి అతని చిత్రాలు చుసిన వారికి ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. మొన్నటి లీడర్ నుండి నిన్నటి బాహుబలి వరకు అయన కెరీర్ గ్రాఫ్ ని ఒకసారి చూసుకుంటే మనకు చాల క్లియర్ గా ఈ విషయం అర్ధమౌతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: